![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -229 లో..... ప్రేమని ధీరజ్ సైకిల్ పై కూర్చొపెట్టుకొని సైకిల్ ని తోసుకుంటూ తీసుకొని వెళ్తాడు. అదంతా సాగర్ చూసి నవ్వుకుంటాడు. మరొకవైపు నర్మద దగ్గరికి సాగర్ వస్తాడు. నర్మద మాట్లాడకపోవడంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటాడు. అయినా సరే నర్మద మాట్లాడదు.
పక్కన ఒకావిడ చూసి నర్మదని ఏడిపిస్తున్నాడెమో అని అనుకొని.. ఎవర్రా నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావని అడుగుతాడు. తను నా భార్య.. చెప్పు నర్మదా అని సాగర్ అంటుంటే నర్మద కాసేపు సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత నా భర్త అని చెప్తుంది. ఏదో చిన్న గొడవ అయింది అని సాగర్ అంటాడు. కోపంగా నర్మద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ధీరజ్ అదంతా చూసి సాగర్ దగ్గరికి వచ్చి నవ్వుతాడు. ఇద్దరు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారు. మరొకవైపు భాగ్యం దగ్గరికి వెళ్తుంది శ్రీవల్లి. మా అయన డబ్బు ఇవ్వమని అంటున్నాడు. ఇప్పుడేం చెయ్యాలని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఇంటి పెత్తనం నీ చేతికి వచ్చినా మనకి కష్టాలు వదలడం లేదని భాగ్యం అనగానే ఆనందరావుకి ఒక ఐడియా వస్తుంది.
ఇంటి పెత్తనం నీదే కాబట్టి ఈ రోజు నేను మీ ఇంటికి దొంగతనానికి వస్తాను. తాళాలు ఇవ్వు డబ్బు తీసుకొని వస్తాను.. ఇదొక్కటే దీనికి పరిష్కారమని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత రామరాజు ఇంటికి భోజనానికి వస్తాడు. భోజనం చేస్తూ ఉంటాడు. వేదవతి ఎంత మాట్లాడిన రామరాజు మాట్లాడడు. వేదవతి పక్కకు వచ్చి బాధపడుతుంది. వాళ్ళు అలా బాధపడడానికి ఒకరకంగా కారణం మనమే.. ఎలాగైనా ఆ వల్లి అక్క ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. తరువాయి భాగంలో ఆనందరావు రామరాజు ఇంటికి దొంగతనానికి వస్తాడు. శ్రీవల్లి డోర్ తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |